దిశ, ఉత్తరాంధ్ర: టీడీపీని, చంద్రబాబును ప్రజలు నమ్మేస్థితిలో లేరని మంత్రి విడదల రజని అన్నారు. విశాఖలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబాగా చంద్రబాబు మారినట్టు కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. మంత్రాలకు ఓట్లు రాలవని తెలుసుకోవాలని హితవు పలికారు. గెలిచే అవకాశం లేదన్న ప్రస్టేషన్‌లో ఉన్నారని, ప్రజల్లో ఏ పార్టీకి ఎంత విశ్వాసం ఉందో మరోసారి రుజువు కాబోతుందన్నారు. చంద్రబాబు నాయుడు మంత్రాలు చదవాలని ప్రజలకు చెప్తుంటే నవ్వొస్తుందని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు విమర్శలు చేస్తుంటే మహిళలు నవ్వుకుంటున్నారని మంత్రి రజిని విమర్శించారు.