Minister Amarnath: ఇంకెంతకాలం మభ్యపెడతారు?

చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అని మంత్రి అమర్‌నాథ్ అన్నారు...

Update: 2023-04-06 10:32 GMT

దిశ, ఉత్తరాంధ్ర: చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అని మంత్రి అమర్‌నాథ్ అన్నారు.  14 ఏళ్లు సీఎంగా చేసిన  చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రజలకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. తాము అభివృద్ధి చేస్తుంటే వాటిని ఎక్కడికి అక్కడ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.  ఉత్తరాంధ్ర ప్రజలను చంద్రబాబు ఇంకెంతకాలం మభ్యపెడతారని అమర్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తే దానికి చంద్రబాబు అడ్డు తగిలారని ధ్వజమెత్తారు. విశాఖలో స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మించాలనుకుంటే కోర్టు కేసులు వేసి దానిని అడ్డుకునే ప్రయత్నం చేశారని మంత్రి అమర్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘విజయవాడలో 140 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. బాబు జగ్జీవన్ రామ్, పూలే విగ్రహాలనూ  ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా?.  దళితులుగా ఎవరైనా పుడతారా? అంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఇప్పటికి ఎవరు మర్చిపోలేదు.’ అని మంత్రి అమర్‌నాథ్ వ్యాఖ్యానించారు.

ఏమైనా అంటే హుదూద్ తుఫాన్ సమయంలో విశాఖ ప్రజలను తానే కాపాడానని, తుఫాన్‌ను సైతం తానే ఆపానని చంద్రబాబు డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.  తుఫాను మాటున విశాఖ కలెక్టరేట్‌లోని రికార్డులన్నీ మాయం చేసిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాలుగు వేల కోట్ల రూపాయల విలువైన భూమిని చంద్రబాబు, ఆయన అనుచరులు స్వాహా చేసుకుంటే వాటిని తమ ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని తెలిపారు. అమరావతిలో ఎంత పెద్ద స్కామ్ జరిగిందో.. విశాఖలో కూడా చంద్రబాబు అదే స్థాయిలో కుంభకోణాలకు పాల్పడ్డారని అమర్‌నాథ్ ఆరోపించారు.

Tags:    

Similar News