Visakha: విశాఖ ప్రజలకు గుడ్ న్యూస్.. దసరాకు బ్రహ్మాండమైన కానుక

విశాఖ రాజధానిపై మంత్రి అమర్‌నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..

Update: 2023-08-02 13:39 GMT

దిశ, వెబ్ డెస్క్: విశాఖ రాజధానిపై మంత్రి అమర్‌నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దసరా పండగ రోజున విశాఖ ప్రజలకు బ్రహ్మాండమైన కానుక ఉంటుందని ఆయన తెలిపారు. విశాఖ ప్రజలు ఎదురు చూస్తున్న కల దసరాతో తీరుతుందని పేర్కొన్నారు. అటు పార్టీని వీడన నాయకులపై మంత్రి అమర్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడి చేసి, జగన్‌ను సీఎంను చేయాలని తపించిన వ్యక్తులు ఎవరూ కూడా వైసీపీను వీడి బయటకు వెళ్లలేదన్నారు. అవసరం, అధికారం, పదవులు, భవిష్యత్తు కోసం వచ్చిన వాళ్లే పార్టీ నుంచి వెళ్లిపోయారని మంత్రి అమర్‌నాథ్ మండిపడ్డారు.

కాగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులను ప్రకటించిన విషయం తెలిసిందే. కర్నూలు న్యాయ రాజధాని, అమరావతి శాసన రాజధాని, విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించారు. అయితే సీఎం జగన్ కూడా విశాఖకు షిఫ్ట్ అవుతానని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయంతో పాటు సీఎంవో‌ను కూడా సిద్దం చేస్తున్నారు. ఈ దసరాకు విశాఖకు సీఎం వెళ్తారని అటు మంత్రులు సైతం చెప్పారు. ఇందులో భాగంగా మంత్రి అమర్‌నాథ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. 

Tags:    

Similar News