AP News:విశాఖకు రైల్వే జోన్..కేంద్రం కీలక ప్రకటన
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు భూ సేకరణ విషయంలో సమస్యలు ఉన్నాయని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
దిశ,వెబ్‌డెస్క్: విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు భూ సేకరణ విషయంలో సమస్యలు ఉన్నాయని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఇంతకు ముందే మీడియాతో మాట్లాడిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ విశాఖ రైల్వే కోసం 53 ఎకరాల స్థలాన్ని కోరాం కానీ ప్రభుత్వం ఇంకా ఆ స్థలాన్ని కేటాయించలేదని తెలిపారు. భూమి ఇచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా నేడు ఇతర భూములు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తాము కోరామని చెప్పారు. భూమి బదిలీ కాగానే జోన్ పనులు చేపడతామన్నారు. ఈ ఏడాది ఏపీలో రైల్వే కు రూ.9151 కోట్ల కేటాయింపులు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.74,743 కోట్ల రైల్వే ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయన్నారు.