Janasena PAC: 2024లో మా దెబ్బేంటో చూపిస్తాం
మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కోన తాతారావు ఆగ్రహం వ్యక్తం చేశారు...
దిశ, ఉత్తరాంధ్ర: మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కోన తాతారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల బలం లేకుండా తమ తండ్రి గుడివాడ గురునాధరావు అంత పెద్ద నాయకుడు అయ్యారా అని ప్రశ్నించారు. విశాఖలో పౌర గ్రంథాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను విమర్శించే మంత్రికి 2024లో జనసేన దెబ్బేంటో చూపిస్తామని హెచ్చరించారు. 2024లో జరిగే ఎన్నికల్లో జనసేన గెలుపుతో పవన్ కల్యాణ్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని సీట్లలో పోటీ చేస్తామన్నది అనవసరమన్నారు. పార్టీ వ్యూహాలు పార్టీకి ఉంటాయని తాతారావు తెలిపారు.
విస్సన్నపేటలో 600 ఎకరాల భూకబ్జా ప్రజలు ఇంకా మరిచిపోలేదని కోన తాతారావు వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్‌పై ఇష్టానుసారంగా వైసీపీ కాపు నేతలు చేసిన విమర్శలు సరికాదన్నారు. ఇప్పటికైనా క్షమాపణ చెప్తే విడిచి పెడతామన్నారు. మంత్రులుగా తమకున్న అర్హతలు ఏంటో చెప్పాలని కోన తాతారావు డిమాండ్ చేశారు.