జనావాసంలో డంపింగ్ యార్డు.. ఆగ్రహం వ్యక్తం చేసిన నాగబాబు
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అనకాపల్లిలో పర్యటించారు....
దిశ, వెబ్ డెస్క్: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అనకాపల్లిలో పర్యటించారు. జనావసంలో ఉన్న డంపింగ్ యార్డును ఆయన పరిశీలించారు. డంపింగ్ యార్డుకు పక్కనే జనవాసాలు, ఆస్పత్రి, ప్రభుత్వ స్కూలు ఉండటంతో ఆయన తీవ్ర ఆవేదన చెందారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై నాగబాబు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనావాసంలో డంపింగ్ యార్డుల ద్వారా చాలా మంది బలవుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల ఆరోగ్యం పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదని, ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోని ఈ ప్రభుత్వానికి రోజలు దగ్గర పడ్డాయని వ్యాఖ్యానించారు. చెత్త నుంచి వెలువడే దుర్వాసనను ప్రతినిత్యం పీల్చుతున్న స్థానిక ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలకు లోనవుతున్నారన్నారు. దుర్వాసనను పీల్చి ఇప్పటికే చాలా మంది మరణించినట్లు తనకు దృష్టికి వచ్చిందన్నారు. వెంటనే డంపింగ్ యార్డును వేరే చోటకి మార్చాలన్నారు. చెత్త పేరుతో పన్నులు వసూలు చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పట్టింకోని ప్రభుత్వాన్ని త్వరలో ప్రజలే ఇంటికి పంపాలని నాగబాబు పిలుపు నిచ్చారు.
ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్న వైసిపి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి
— JanaSena Party (@JanaSenaParty) February 21, ౨౦౨౪
* జనావాసంలో డంపింగ్ యార్డుల ద్వారా అనేక మంది బలవుతున్నారు
* ప్రజల ఆరోగ్య పరిరక్షణ ప్రభుత్వ ప్రధాన బాధ్యత
* అనకాపల్లి డంపింగ్ యార్డు సందర్శనలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు pic.twitter.com/JK3ybtucJZ