విశాఖలో టీడీపీ అభ్యర్థి కార్యాలయ శంకుస్థాపనను అడ్డుకున్న పోలీసులు..కారణం ఇదే?
టీడీపీ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం.భరత్ ఎన్నికల కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమాన్ని పోలీసులు ఆదివారం ఉదయం అడ్డుకున్నారు. బీచ్ రోడ్ లోని అప్పు ఘర్ సమీపంలోని ఖాళీ స్థలంలో కార్యాలయం ఏర్పాటుకు ఆయన భూమి పూజ చేయడానికి సంకల్పించారు.
దిశ ప్రతినిధి, విశాఖపట్నం:టీడీపీ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం.భరత్ ఎన్నికల కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమాన్ని పోలీసులు ఆదివారం ఉదయం అడ్డుకున్నారు. బీచ్ రోడ్ లోని అప్పు ఘర్ సమీపంలోని ఖాళీ స్థలంలో కార్యాలయం ఏర్పాటుకు ఆయన భూమి పూజ చేయడానికి సంకల్పించారు.అయితే అనుమతి లేకుండా కార్యాలయం ప్రారంభించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో ఎం.భరత్ మాట్లాడుతూ..ఇక్కడ సభలు,సమావేశాలు నిర్వహించడం లేదని కేవలం కుటుంబ సభ్యులతో కొబ్బరి కాయ కొట్టి పూజ చేస్తున్నామని తెలిపారు. దీంతో మీడియా లేకుండా భూమి పూజకు అనుమతించారు. ఎంపీ అభ్యర్థి కార్యాలయం ప్రారంభోత్సవం పేరిట వాట్సాప్ గ్రూపులో సందేశాలు రావడంతోనే అనుమతి కోసం తామడిగామని పోలీసులు స్పష్టం చేశారు.దీంతో మీడియాతో మాట్లాడకుండా భూమి పూజ చేసి భరత్ వెనుదిరిగారు.