Visakha Summit: ఏపీలో అంచనాలకు మించి పెట్టుబడులు.. ఎన్ని లక్షల కోట్లు వచ్చాయంటే..

Update: 2023-03-04 10:05 GMT

దిశ, ఉత్తరాంధ్ర: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌-2023 నిర్వహించింది. మొదటి రోజు రూ. 11.87 లక్షల కోట్ల పెట్టుబడులకు గానూ 92 ప్రముఖ సంస్థలతో ఎంవోయూలు చేసుకున్నారు. వైయస్‌ జగన్‌. రెండోరోజు శనివారం పలు దిగ్గజ కంపెనీలతోనూ ఎంవోయూలు చేసుకున్నారు. లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదురాయి. విశాఖ వేదికగా జరిగిన జీఐఎస్‌లో అంచనాలకు మించి ఇన్వెస్ట్‌మెంట్స్‌ వచ్చాయి.

ఈ సందర్భంగా వైఎస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతికి అడుగులు వేస్తున్నామని చెప్పారు. విశాఖ సమ్మిట్‌లో 15 రంగాల్లో 352 ఎంవోయూలు కుదుర్చుకుని తద్వారా పెట్టుబడిదారులకు భరోసా కల్పించినట్టయిందని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు ఏపీ స్వర్గధామంలా ఉంటుందని, మౌలిక సదుపాయాలకు కొరత లేదని తెలిపారు. పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకొచ్చేవారికి అండగా ఉంటామని భోరసానిచ్చారు. ఇంథన ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. అదే విధంగా రూ.3841 కోట్లతో 9108 మందికి ఉద్యోగాలు కల్పించేలా చేస్తున్నామన్నారు. జీఐఎస్‌ ద్వారా రాష్ట్రానికి మొత్తం రూ.13 లక్షల 5 వేల 663 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయన్నారు. దాదాపు 6 లక్షల 3 వేల 223 మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు.

ఒక్క ఎనర్జీ రంగంలోనే రూ.8లక్షల 84వేల కోట్లు

మొత్తం పెట్టుబడుల్లో 8 లక్షల 84 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కేవలం ఎనర్జీ రంగంలో వచ్చాయని సీఎం జగన్ తెలిపారు. గ్రీన్‌ ఎనర్జీతో భారత దేశ లక్ష్యాలను చేరుకోవడంలో ఈ ప్రయాణం కీలకమన్నారు. పర్యాటక రంగంలో 22 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపీకి వచ్చాయని తెలిపారు. అందరి పెట్టుబడులతో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. తద్వారా ఏపీని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు.

జీఐఎస్ రెండో రోజు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న కంపెనీలివే..

ఎకో స్టీల్‌ ఎంవోయూ రూ. 894 కోట్లు

బ్లూస్టార్‌ ఎంవోయూ రూ. 890 కోట్లు

ఎస్‌2పీ సోలార్‌ సిస్టమ్స్‌ ఎంవోయూ రూ. 850 కోట్లు

గ్రీన్‌లామ్‌ సౌత్‌ లిమిటెడ్‌ ఎంవోయూ రూ. 800 కోట్లు

ఎక్స్‌ప్రెస్‌ వెల్‌ రీసోర్సెస్‌ ఎంవోయూ రూ. 800 కోట్లు

రామ్‌కో ఎంవోయూ రూ. 750 కోట్లు

క్రిబ్కో గ్రీన్‌ ఎంవోయూ రూ. 725 కోట్లు

ప్రకాశ్‌ ఫెరోస్‌ ఎంవోయూ రూ. 723 కోట్లు

ప్రతిష్ట బిజినెస్‌ ఎంవోయూ రూ. 700 కోట్లు

తాజ్‌ గ్రూప్‌ ఎంవోయూ రూ. 700 కోట్లు

కింబర్లీ క్లార్క్‌ ఎంవోయూ రూ. 700 కోట్లు

అలియన్న్‌ టైర్‌ గ్రూప్‌ ఎంవోయూ రూ. 679 ?కోట్లు

దాల్మియా ఎంవోయూ రూ. 650 కోట్లు

అనా వొలియో ఎంవోయూ రూ. 650 కోట్లు

డీఎక్స్‌ఎన్‌ ఎంవోయూ రూ. 600 కోట్లు

ఈ-ప్యాక్‌ డ్యూరబుల్‌ ఎంవోయూ రూ. 550 కోట్లు

నాట్‌ సొల్యూషన్న్‌ ఎంవోయూ రూ. 500 కోట్లు

అకౌంటిఫై ఇంక్‌ ఎంవోయూ రూ. 488 కోట్లు

కాంటినెంటల్‌ ఫుడ్‌ అండ్‌ బెవరేజీస్‌ ఎంవోయూ రూ. 400 కోట్లు

నార్త్‌ ఈస్ట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎంవోయూ రూ. 400 కోట్లు

ఆటమ్‌స్టేట్‌ టెక్నాలజీస్‌ ఎంవోయూ రూ. 350 కోట్లు

క్లేరియన్‌ సర్వీసెస్‌ ఎంవోయూ రూ. 350 కోట్లు

చాంపియన్‌ లగ్జరీ రిసార్ట్స్‌ ఎంవోయూ రూ. 350 కోట్లు

వీఆర్‌ఎమ్‌ గ్రూప్‌ ఎంవోయూ రూ. 342 కోట్లు

రివర్‌ బే గ్రూప్‌ ఎంవోయూ రూ. 300 కోట్లు

హావెల్స్‌ ఇండియా ఎంవోయూ రూ. 300 కోట్లు

సూట్స్‌ కేర్‌ ఇండియా ఎంవోయూ రూ. 300 కోట్లు

పోలో టవర్స్‌ ఎంవోయూ రూ. 300 కోట్లు

ఇండియా అసిస్ట్‌ ఇన్‌సైట్స్‌ ఎంవోయూ రూ. 300 కోట్లు

స్పార్క్‌ ఎంవోయూ రూ. 300 కోట్లు

టెక్‌ విషెన్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంవోయూ రూ. 300 కోట్లు

మిస్టిక్‌ పామ్స్‌ ఎంవోయూ రూ. 300 కోట్లు

నియోలింక్‌ గ్రూప్‌ ఎంవోయూ రూ. 300 కోట్లు

ఎండానా ఎనర్జీస్‌ ఎంవోయూ రూ. 285 కోట్లు

అబ్సింకా హోటల్స్‌ ఎంవోయూ రూ. 260 కోట్లు

సర్‌ రే విలేజ్‌ రిసార్ట్స్‌ ఎంవోయూ రూ. 250 కోట్లు

హ్యాపీ వండర్‌లాండ్‌ రిసార్ట్స్‌ ఎంవోయూరూ. 250 కోట్లు

చాంపియన్స్‌ యాచ్‌ క్లబ్‌ ఎంవోయూ రూ. 250 కోట్లు

టెక్నోజెన్‌ ఎంవోయూ రూ. 250 కోట్లు

పార్లె ఆగ్రో ఎంవోయూ రూ. 250 కోట్లు

ఎకో అజైల్‌ రిసార్ట్‌ ఎంవోయూ రూ. 243 కోట్లు

ఎల్జీ పాలిమర్స్‌ ఎంవోయూ రూ. 240 కోట్లు

హైథియన్‌ హ్యూయన్‌ మిషనరీ ఎంవోయూ రూ. 230 కోట్లు

గోకుల్‌ ఆగ్రో ఎంవోయూ రూ. 230 కోట్లు

Tags:    

Similar News