విశాఖలో అడుగడుగునా తనిఖీలు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విశాఖపట్నం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ సుబ్బారావు సిబ్బంది తో నగరాన్ని జల్లెడ పడుతున్నారు.

Update: 2024-03-21 13:37 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం:సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విశాఖపట్నం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ సుబ్బారావు సిబ్బంది తో నగరాన్ని జల్లెడ పడుతున్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన పోలీసులు చెక్ పోస్ట్ లు అడవివరం, సరిపల్లి, అగనంపూడి, భీమిలి, చిన్న పురం లో స్థానిక ఎన్ఫోర్స్మెంట్ సీఐ ల తో కలిసి వాహనాల తనిఖీలు చేశారు. గంజాయి,అక్రమ మద్యం, మాదక ద్రవ్యాల, నగదు అక్రమ రవాణాను అరికట్టేందుకు నిరంతరంగా దాడులు చేస్తున్నామని సుబ్బారావు తెలిపారు.ఇందుకోసం స్నిపర్ డాగ్ తో తనిఖీలు చేశారు.విశాఖపట్నం సబ్ స్టేషన్ పరిధి లో గత వారం 50 కేసులు నమోదు చేసి వందల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.సెబ్ జాయింట్ డైరెక్టర్ ఆదేశాల ప్రకారం సెబ్ పోలీసులు బృందాలుగా ఏర్పడి విధులు నిర్వహిస్తున్నమని తెలిపారు.


Similar News