Vizag:ఆర్కే బీచ్ లో నలుగురు యువకులను కాపాడిన జీవీఎంసీ లైఫ్ గార్డులు

మహా విశాఖ నగర పాలక సంస్థ జోన్ -4 ,ఆర్కే బీచ్ జోన్ -6 అప్పికొండ బీచ్ లలో సోమవారం హోలీ సందర్భంగా స్నానానికి సముద్రంలో దిగి మునిగిపోతున్ననలుగురు యువకులను గమనించి జీవీఎంసీ లైఫ్ గార్డులు వారిని రక్షించి ప్రాణాలు కాపాడారు.

Update: 2024-03-25 14:09 GMT

దిశ ప్రతినిధి,విశాఖపట్నం:మహా విశాఖ నగర పాలక సంస్థ జోన్ -4 ,ఆర్కే బీచ్ జోన్ -6 అప్పికొండ బీచ్ లలో సోమవారం హోలీ సందర్భంగా స్నానానికి సముద్రంలో దిగి మునిగిపోతున్ననలుగురు యువకులను గమనించి జీవీఎంసీ లైఫ్ గార్డులు వారిని రక్షించి ప్రాణాలు కాపాడారు. జీవీఎంసీ కమిషనర్ సీఎం.సాయి కాంత్ వర్మ విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీకి చెందిన కౌశిక్( 20) , బషీర్ (19) , తుంగ్లాం ప్రాంతానికి చెందిన సన్నీ కుమార్ (17), గోల్ కుమార్ (23) లను రక్షించినట్లు తెలిపారు.

ఈ కాలేజీ విద్యార్థులు హోలీ వేడుకల్లో భాగంగా విశాఖ ఆర్కే బీచ్ పాండురంగాపురం, అప్పికొండ బీచ్ సమీపంలో ఆటవిడుపుగా స్నానాలకు బీచ్ లోకి వెళ్ళగా ప్రమాదవశాత్తు మునిగిపోతున్న సమయంలో జీవీఎంసీ లైఫ్ గార్డ్ హరీష్, నవీన్, అరవింద్, అచ్చన్న, కిషోర్, వెంకటేష్ ,తాతారావు లతోపాటు పోలీస్ పెట్రోలింగ్ వై గణపతి తదితరులు వారిని ఒడ్డుకు చేర్చారు. వీరిలో ఒకరికి CPR జరిపి వెంటనే 108 లో కేజీహెచ్ కు తరలించారు. అందరూ ప్రాణాలతో ఉన్నారని కమిషనర్ తెలిపారు.


Similar News