చారిత్రక సంపదపై ప్రభుత్వం ఫోకస్.. కీలక ఆదేశాలు

చారిత్రక వారసత్వ సంపద అయిన ఎర్రమట్టి దిబ్బలపై సమగ్ర అధ్యయనం చేసి వాస్తవాలతో నివేదిక సమర్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ....

Update: 2024-09-13 02:15 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: చారిత్రక వారసత్వ సంపద అయిన ఎర్రమట్టి దిబ్బలపై సమగ్ర అధ్యయనం చేసి వాస్తవాలతో నివేదిక సమర్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎర్ర మట్టి దిబ్బలను ఆనుకొని ఉన్న నేరెళ్లవలస గ్రామంలో భీమునిపట్నం మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి ఇచ్చిన భూములను రద్దు చేయాలంటూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఇచ్చిన పిటిషన్‌పై స్పందించిన ప్రభుత్వం ఈ మేరకు విశాఖ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఎర్రమట్టి దిబ్బలపై సమగ్రంగా, సహేతుకంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు రాష్ట్ర రెవెన్యూ శాఖ లేఖ పంపించింది.

ఎన్నికల సమయంలో విధ్వంసం..

సర్వేనెంబర్ 118/ 5ఎలో 250 ఎకరాలకు పైగా భూములు గతంలో సొసైటీకి కేటాంచారు. ఎన్నికల సమయంలో ఇక్కడ పెద్ద ఎత్తున విధ్వంసం జరగటం వివాదాస్పదంగా మారింది. తవ్వకాలు జరిగిన ప్రాంతాలు ఎర్రమట్టి దిబ్బల పరిధిలోనే ఉన్నాయని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. వారసత్వ సంపదగా ఎర్రమట్టి దిబ్బల పరిరక్షించి అవసరమైతే భీమిలి సొసైటీకి ప్రత్యామ్నాయ భూములు కేటాయించాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు.


Similar News