visakha: మంత్రి అమర్‌నాథ్‌పై బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు

నారా లోకేష్ పాదయాత్రకు ప్రజాదరణ పెరుగుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉత్తరాంధ్ర ఇంచార్జి బుద్ధ వెంకన్న అన్నారు...

Update: 2023-05-15 13:39 GMT

దిశ, ఉత్తరాంధ్ర: నారా లోకేష్ పాదయాత్రకు ప్రజాదరణ పెరుగుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉత్తరాంధ్ర ఇంచార్జ్ బుద్ధ వెంకన్న అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమా వేశంలో వెంకన్న మాట్లాడుతూ నారా లోకేష్ పాదయాత్ర దిగ్వి జయంగా 100 పూర్తి అయ్యిందని చెప్పారు. జగన్ పాదయాత్ర మార్నింగ్, ఈవినింగ్ వాక్‌గా ఉండేదని అన్నారు. లోకేష్ పాదయాత్రతో భారత దేశంలో చరిత్ర సృష్టిస్తున్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్న కులాలను లోకేష్ కలుస్తున్నారన్నారు. అట్టడుగు వర్గాలు ఏదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసు కుంటున్నారని తెలిపారు. వైసీపీ వాళ్ళు లోకేష్ పాదయాత్రను చిన్నచూపు చూసారని, పాదయాత్రకు రోజురోజుకూ జనాదరణ పెరుగుతుందని అన్నారు. అది చూసి వైసీపీ నేతల కళ్ళు బైర్లు కమ్ముతున్నాయని విమర్శించారు. పాదయాత్రలో లోకేష్ అడుగులతో జగన్ గుండెల్లో పిడుగులు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. లోకేష్ పాదయాత్ర ఎక్కడా విరామం లేకుండా కొనసాగుతోందని అన్నారు. జగన్ పాదయాత్రలో రెండు రోజులు సెలవులు కూడా ఉండేవన్నారు.

జగన్ పిచ్చి పరాకాష్టకు చేరిందని బుద్దా అన్నారు. జగన్ విశాఖ వస్తానని అంటుంటే పరిపాలనకు అనుకున్నామని, జగన్ నిన్న చేసిన పిచ్చి చేష్టలతో అసలు నిజం తమకు తెలిసిందన్నారు. పిచ్చి కుదుర్చుకునేందుకే జగన్ విశాఖ వస్తున్నాడని, త్వరలో రాక్షస సంహారం జరుగుతుందని చెప్పారు. ఈసారి అమర్ నాథ్‌కు కాపులే బుద్ధి చెపుతారని అన్నారు. పవన్ వచ్చినప్పుడు అనకాపల్లి సెంటర్‌లో అమర్ నిల్చుంటే ఫాంట్ షర్ట్ విప్పుతారని, అమర్నాధ్ ఒన్ టైం ఎమ్మెల్యేనని బుద్దా వెంకన్న విమర్శించారు.

Read more:

Viveka Case: ఎంపీ అవినాశ్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

Ongole: వైసీపీలో తారా స్థాయికి వర్గ విభేదాలు.. ఎమ్మెల్యే బాలినేని సంచలన వ్యాఖ్యలు

Tags:    

Similar News