విశాఖలో బీఆర్ఎస్ నేతల ఆందోళన.. అరెస్ట్

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విశాఖ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు నగర వ్యాప్తంగా ఆదివారం ఉదయం నుంచి ఆందోళనలు చేపట్టారు...

Update: 2023-06-11 15:01 GMT

దిశ, ఉత్తరాంధ్ర: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విశాఖ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు నగర వ్యాప్తంగా ఆదివారం ఉదయం నుంచి ఆందోళనలు చేపట్టారు. వేర్వేరు ప్రాంతాల్లో నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌లకు తరలించారు. ఈ సందర్బంగా నేతలు తలారి సురేష్, గిద్దె శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు కలిసి దేశాన్ని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకు, విశాఖకు తీవ్ర ద్రోహం చేసిందని, ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని విశాఖకు అమిత్ షా వచ్చారన్నారు. పోర్టు, రక్షణ రంగం, రైల్వే, విద్యుత్‌, ఆయిల్‌ పరిశ్రమలు, బ్యాంకులు, ఎల్‌ఐసీ, పోస్టల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ తదితర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరిస్తోందని తెలిపారు. ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం చేసే విధంగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడానికి పూనుకున్న నరేంద్ర మోదీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని అమిత్ షా కోరారు.

Tags:    

Similar News