Mp Gvl: ఎంపీ అవినాశ్‌రెడ్డి అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్టుపై ఎలాంటి ఉత్కంఠ అవసరం లేదని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు...

Update: 2023-05-25 13:41 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్టుపై ఎలాంటి ఉత్కంఠ అవసరం లేదని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఫ్యాక్షనిజం ఒత్తిళ్లకు కేంద్ర సంస్థలు ఆగబోవని స్పష్టం చేశారు. సీబీఐ నిర్ణయించుకుంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తుంది. సీబీఐని ఏ శక్తి ఆపలేదు అని జీవీఎల్ నరసింహారావు అన్నారు. విశాఖలో గురువారం ఎంపీ జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడారు. అరెస్ట్ విషయంలో సీబీఐ నిర్ణయం తీసుకునేంత వరకు అందరూ ఓపిక పట్టాల్సిందేనని చెప్పారు. అవినాశ్ అరెస్ట్ ఎప్పుడనే అంశంలో ఉత్కంఠ అవసరం లేదన్నారు. సీబీఐ నిర్ణయం తీసుకుంటే ఆపడం ఎవరితరం కాదని జీవీఎల్ నర్సింహారావు తెలిపారు. సీబీఐ సంస్థ తాటాకు చప్పుళ్లకు భయపడే సంస్థ కాదని జీవీఎల్ పేర్కొన్నారు. తోక పార్టీల విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

మరోవైపు ఏపీ అభివృద్ధికి కేంద్రం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి నిధులిచ్చి ఏపీపై ప్రధాని నరేంద్రమోడీ తన అభిమానాన్ని చాటుకున్నారని చెప్పుకొచ్చారు. నిధులను పక్కదారి పట్టిస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదని ఎంపీ జీవీఎల్ నరసింహారావు హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి: Breaking: ఎంపీ అవినాశ్ బెయిల్‌పై విచారణ వాయిదా

Tags:    

Similar News