Pollution:విశాఖ పోర్టు కాలుష్యాన్ని నివారించండి..ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్
దక్షిణ నియోజకవర్గంలో ప్రధాన సమస్యగా మారిన పోర్టు కాలుష్యాన్ని నివారించాలని ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ పోర్టు అధికారులను కోరారు. ఆయన బుధవారం పోర్టు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
దిశ ప్రతినిధి,విశాఖపట్నం:దక్షిణ నియోజకవర్గంలో ప్రధాన సమస్యగా మారిన పోర్టు కాలుష్యాన్ని నివారించాలని ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ పోర్టు అధికారులను కోరారు. ఆయన బుధవారం పోర్టు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు. ముఖ్యంగా ఎస్‌ఆర్ కాలువ చూట్టూ అపరిశుభ్ర వాతావరణం నెలకొందని వెంటనే ఆ పరిసరాలను క్లీన్ చేయించాలని ఆయన పోర్టు అధికారులను కోరారు.
అంతే కాకుండా కాలువ చుట్టూ పచ్చదనాన్ని పెంపొందించే చర్యలు చేపట్టాలని సూచించారు. పోర్టు కాలుష్యం వల్ల తన నియోజకవర్గంలోని ప్రజలు అనారోగ్యం బారిన పడుతన్నారని అందువల్ల వెంటనే అక్కడి ప్రజలకు ఆరోగ్య సదుపాయాలను అందించేలా హెల్త్ క్యాంపులను నిర్వహించాలని సూచించారు. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లేందుకు పెద్ద వయసు వారు ఇబ్బందులు పడుతున్నందున ఒక లిఫ్ట్ ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో పోర్టు అధికారులు వేణుగోపాల్, శ్రీరామ చంద్ర మూర్తి, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు.