చిరంజీవిని అన్నా.. అని సంబోధించిన ముఖ్యమంత్రి జగన్

Update: 2022-02-10 11:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వివాదంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం మెగాస్టార్ చిరంజీవి బృందంతో భేటీ అయిన అనంతరం సీఎం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణతో పోలిస్తే ఇండస్ట్రీకి ఏపీ నుంచే ఎక్కువ కంట్రిబ్యూషన్ ఉందని అన్నారు. తెలంగాణ నుంచి 40 శాతం ఆదాయం వస్తే.. ఏపీ నుంచి 60 శాతం ఆదాయం వస్తున్నదని వ్యాఖ్యానించారు. ఏపీలోనూ సినిమా షూటింగ్‌లు చేయాలని సూచించారు. అంతేగాక, విశాఖలో స్టూడియోలు నిర్మించడానికి స్థలాలు ఇస్తామని ప్రకటించారు. విశాఖలో జూబ్లీహిల్స్ తరహా వాతావరణం క్రియేట్ చేయాలని అన్నారు. ఇప్పటివరకు కొద్దిమందికి ఎక్కువ, కొద్దిమందికి తక్కువ టికెట్ రేట్లు వసూలు చేశారని అన్నారు. దీనిపై చిరంజీవి అన్న, తాను విస్తృతంగా చర్చించినట్లు సీఎం జగన్ తెలిపారు. ఇకనుంచి నిర్మాతలకు నష్టం లేకుండా ప్రేక్షకులకు భారం కాకుండా, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా అందరికీ ఒకే టికెట్ రేట్ ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అందరికీ ప్రయోజనం జరిగేలా, అందరికీ న్యాయం జరిగేలా సినిమా టికెట్ల రేట్లు ఉంటాయని అన్నారు. వంద కోట్ల బడ్జెట్‌తో సినిమా తీస్తే ప్రత్యేక రాయితీ ఇస్తామని ప్రకటించారు. కాగా, సీఎం జగన్ మాట్లాడుతున్నంతసేపు మెగాస్టార్ చిరంజీవిని అన్నా.. అని ప్రస్తావించడం విశేషం.

Tags:    

Similar News