AP 10th Results:పదో తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి
ఏపీ పదో తరగతి ఫలితాల్లో 86.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఆ ఫలితాల్లో బాలికలదే పైచేయి అయింది.
దిశ ప్రతినిధి,విశాఖపట్నం: ఏపీ పదో తరగతి ఫలితాల్లో 86.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఆ ఫలితాల్లో బాలికలదే పైచేయి అయింది. పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ సోమవారం విడుదల చేసిన ఫలితాల్లో బాలికలు 89.17 శాతం, బాలురు 84.32 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలోని 2,803 పాఠశాలలు నూరు శాతం ఉత్తీర్ణత సాధించగా, 17 పాఠశాలలో సున్నా ఉత్తీర్ణతతో నిరాశ పర్చాయి. ఆ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ..‘‘మార్చి 18 నుంచి 30 వరకు 10 పరీక్షలు నిర్వహించాం. పరీక్షలకు 6,16,615 మంది పరీక్షలు రాస్తే.. 86.69 శాతం మంది పాస్ అయ్యారు. మొత్తం 5,34,674 మంది పాస్ అయ్యారు. ఈ సంవత్సరం 10 పరీక్షలో ఒక్క విద్యార్థి కూడా మాల్ ప్రాక్టీస్ కు పాల్పడలేదు. ఒక ఉపాధ్యాయుని పైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. మొదటి సారి లాస్ట్ వర్కింగ్ డే కన్నా ముందే 10 ఫలితాలు ఇస్తున్నాం’’ అని చెప్పారు.
పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో పార్వతీపురం మన్యం జిల్లా 96.87 శాతంతో అగ్రస్థానంలో నిలువగా, కర్నూలు జిల్లా 62.47శాతంతో ఆఖరి స్థానంలో వుంది. ఏపీ రెసిడెన్షియల్ , బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో 98.43 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 96.72 శాతం నమోదైంది. జిల్లా పరిషత్ పాఠశాలలో 79.38శాతం, ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలల్లో 80.01 శాతం , మున్సిపల్ స్కూల్ లలో 75.42 శాతం ఉత్తీర్ణత వచ్చింది. ఫస్ట్ క్లాస్ 69.26 శాతం ఫలితాల్లో ప్రథమ శ్రేణిలో 69.26,ద్వితీయ శ్రేణిలో 11.87, త్రుతీయ శ్రేణిలో 5.56 శాతం మంది పాసయ్యారు. మే 24 నుంచి జూన్ 3 వరకు అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని, రేపటి నుంచి ఆన్ లైన్ లో రీవాల్యుయేషన్, రీ కౌంటింగ్ దరఖాస్తులు స్వీకరించనున్నామని సురేష్ తెలిపారు. నాలుగు రోజుల్లో విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి మెమోలు డౌన్లోడ్ చేసుకోవచ్చని అన్నారు.
Read More..