AP News:గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారిణిని అభినందించిన ఆడారి ఆనంద్
జాతీయ ఎల్బో బాక్సింగ్‌లో పశ్చిమ నియోజకవర్గం 60వ వార్డుకు చెందిన రేష్మ యాదవ్ గోల్డ్ మెడల్ సాధించింది. గోవాలో జరిగిన ఈ పోటీల్లో విజేతగా నిలిచిన రేష్మను పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అభినందించారు.
దిశ ప్రతినిధి,విశాఖపట్నం: జాతీయ ఎల్బో బాక్సింగ్‌లో పశ్చిమ నియోజకవర్గం 60వ వార్డుకు చెందిన రేష్మ యాదవ్ గోల్డ్ మెడల్ సాధించింది. గోవాలో జరిగిన ఈ పోటీల్లో విజేతగా నిలిచిన రేష్మను పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో క్రీడాకారులకు ఇతోధిక సేవలు అందించినట్టు పేర్కొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న తనకు విజయాన్ని చేకూర్చాలని కోరారు. జై భీమ్ బాక్సింగ్ క్లబ్ శిక్షణ పొందిన క్రీడాకారిణి గతంలో కూడా రాష్ట్ర జాతీయ స్థాయిలో అవార్డులు సంపాదించారు. ఎల్బో బాక్సింగ్ కోచ్‌జి రామారావు శిక్షణలో తర్ఫీదు పొంది, ఎల్బో బాక్సింగ్ లో మంచి క్రీడాకారిణిగా పేరు సంపాదించారని తెలిపారు.
నిరుపేదలకు అండగా ఉండి సంక్షేమ పథకాల అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావడానికి ప్రతి ఒక్కరు ఓటు వేసి గెలిపించాలని యలమంచిలి మున్సిపల్ చైర్మన్, విశాఖ డెయిరీ డైరెక్టర్ పిల్లా రమాకుమారి అన్నారు. జీవీఎంసీ 58 వ వార్డు కార్పొరేటర్ గులివిందల లావణ్య ఆధ్వర్యంలో రాజా కమలాదేవి కాలనీ గల్లా ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సగర, ఉప్పర సంక్షేమ సేవా సంఘం ఆత్మీయ సమావేశంలో రమాకుమారి పాల్గొని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి సగర, ఉప్పర సామాజిక వర్గాల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. తన సోదరుడు ఆనంద్ కుమార్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కోసం 19 నెలల గా కష్టపడి పని చేస్తున్నారని, అది అందరికీ తెలుసన్నారు.
పేదవారికి పెన్షన్, నిరుపేద విద్యార్థులకు విద్య కోసం ఆర్థిక సాయం, పేదవారి కోసం ఉచిత వైద్యం అందించినట్లు తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్‌కి విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మికి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని రమా కుమారి ఓటర్లను అభ్యర్థించారు. ఆనంద్‌ను, ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించినట్లయితే ఐదేళ్ల పాటు మీకోసం సేవలు అందిస్తాడని తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో 58 వార్డు ఇన్చార్జి గులిగిందల కృష్ణ, అంగ వర్మ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఉప్పర సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.