Menstrual Leave:విద్యార్థినులకు గుడ్ న్యూస్..నెలలో ఒక రోజు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం!
రాష్ట్రంలో తొలిసారిగా విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ విద్యార్థినిలకు నెలలో ఒక రోజు నెలసరి సెలవు ప్రకటించింది.
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో తొలిసారిగా విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ విద్యార్థినిలకు నెలలో ఒక రోజు నెలసరి సెలవు ప్రకటించింది. పీరియడ్స్ సమయంలో ఆరోగ్య సమస్యలతో విద్యార్థినులు కాలేజీకి వెళ్లడం లేదు. ప్రత్యేకంగా సెలవు కావాలంటే మెడికల్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. తమకు నెలసరి సమయంలో ప్రత్యేక సెలవు ఇవ్వాలంటూ..యూనివర్సిటీ విద్యార్థినులు గత విద్యా సంవత్సరంలోనే రిజిస్ట్రార్ ముందు ఈ ప్రతిపాదన పెట్టారు. జనవరిలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దీంతో విద్యార్థులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థినులకు సెలవు ఇవ్వాలని యూనివర్సిటీ నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థినులు మెయిల్ ద్వారా ఈ లీవ్ తీసుకోవచ్చు. ఈ విషయమై గత ఏడాది విద్యార్థినులు రిజిస్ట్రార్‌కు ప్రతిపాదన చేయగా జనవరిలో ఆమోదం తెలిపారు. ఇప్పటికే దేశంలోని 7 యూనివర్సిటీల్లో ఈ సెలవు విధానం అమల్లో ఉంది.