HMPV పై అలర్ట్.. విమ్స్ ఆస్పత్రిలో 20 పడకల వార్డు ఏర్పాటు

హ్యూమన్ మెటాన్యూమో వైరస్ (హెచ్ఎంపీవీ) కేసులు దేశంలో నమోదు కావడంతో కోవిడ్ లో వేలాది మందికి వైద్యం అందించిన విమ్స్ ఆస్పత్రి అలెర్ట్ అయ్యింది

Update: 2025-01-09 11:28 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: హ్యూమన్ మెటాన్యూమో వైరస్ (హెచ్ఎంపీవీ) కేసులు దేశంలో నమోదు కావడంతో కోవిడ్ లో వేలాది మందికి వైద్యం అందించిన విమ్స్ ఆస్పత్రి అలెర్ట్ అయ్యింది. వ్యాధి గ్రస్తులకు చికిత్స అందించడం కోసం ముందస్తు చర్యగా విమ్స్ ఆస్పత్రిలో 20 పడకలతో ప్రత్యేక వార్డును విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కే రాంబాబు ఆదేశాల మేరకు సిద్ధం చేశారు. ఆస్పత్రిలో కోవిడ్ సమయంలో ఏర్పాటు చేసిన హై ఫ్లోన్యాసల్ కాన్యులా (నిమషంలో 60 లీటర్ల ఆక్సిజన్ అందించే) వాటిని కూడా సిద్ధం చేశారు. అవసరమైన మందులను అందుబాటులో ఉంచారు. ప్రజలు ఈ వైరస్ పై వస్తున్న వదంతులు నమ్మవద్దని, ఇది ప్రాణాంతకం కాదని, సాధారణ ఫ్లూ వైరస్ లక్షణాలే కనిపిస్తాయని తెలియజేసింది.

వైరస్ లక్షణాలు..

జ్వరం, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, ఆయాసం వంటివి వైరస్ లక్షణాలు. వైరస్ సోకిన వారికి రిబావిరిన్ , అజిత్రో మైసిన్ లాంటి మందులతో చికిత్స అందిస్తారు. పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉంది.


Similar News