ఏపీకి వర్ష సూచన.. మూడు రోజులు జర భద్రం

రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ స్పష్టం చేసింది...

Update: 2024-06-02 16:15 GMT

దిశ, వెబ్ డెస్క్: నైరుతి రుతుపవనాలు ఏపీకి ప్రవేశించాయి. ప్రస్తుతం చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు రుతుపవనాలు విస్తరించాయి. అయితే మరో మూడు రోజుల్లో మిగిలిన ప్రాంతాలకు విస్తరించనున్నాయి. దీంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అటు ఉష్ణోగ్రతలు సైతం క్రమంగా తగ్గుముఖం పడతాయని వెల్లడించింది. మరోవైపు ఏపీలో పలుచోట్ల ఇప్పటికే వర్షం పడింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటితో మొదలైన వర్షం మోస్తరుగా నమోదు అయింది. పల్నాడు, అనంతపురం జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలుచోట్ల రహదారలపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


Similar News