Vijayawada: "శభాష్ పోలీసన్న".. వృద్దురాలిని కాపాడిన కానిస్టేబుల్ పై ప్రశంసలు

శభాష్ పోలీసన్న(Well done Policeman) అని ఓ కానిస్టేబుల్(constable) పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Update: 2024-12-31 11:02 GMT

దిశ, వెబ్ డెస్క్: శభాష్ పోలీసన్న(Well done Policeman) అని ఓ కానిస్టేబుల్(constable) పై ప్రశంసల వర్షం కురుస్తోంది. న్యూఇయర్ వేళ దుర్గమ్మను దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికీ పెద్ద ఎత్తున భక్తులు తరిలివెళ్లారు. దీంతో దర్శనానికి భారీగా క్యూ కట్టారు. ఈ నేపధ్యంలోనే దుర్గమ్మ(Durgamma) దర్శనానికి వచ్చిన అచ్చయమ్మ అనే వృద్ధురాలు(Old woman) క్యూలైన్ లో కళ్లు తిరిగి పడిపోయింది. అందరూ చూస్తుండగానే అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో అక్కడే విధి నిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్ అప్రమత్తమై సంరక్షణ చర్యలకు పూనుకున్నాడు. ఆమెను క్యూలైను నుంచి చేతులపై మోసుకొని కొండపై ఉన్న ప్రథమ చికిత్స కేంద్రానికి తరలించారు. అక్కడ ఉన్న వైద్య సిబ్బంది ఆ వృద్ధురాలికి ప్రథమ చికిత్స అందించి, ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆ వృద్ధురాలు ప్రాణాలతో బయటపడింది. దీనిపై ఆలయ అధికారులు, దుర్గమ్మ భక్తులు సెల్యూట్ పోలీస్(Salute police) అని, కానిస్టేబుల్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Tags:    

Similar News