Vijayawada: 4 లక్షల గాజులతో జగన్మాతకు అలంకరణ.. భక్తులకు గాజుల పంపిణీ

విజయవాడ(Vijayawada) ఇంద్రకీలాద్రి(Indrakiladri)పై కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

Update: 2024-11-03 08:14 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: విజయవాడ(Vijayawada) ఇంద్రకీలాద్రి(Indrakiladri)పై కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు యమ ద్వీతియ(Yama Dwithiya) సందర్భంగా జగన్మాతకు గాజుల అలంకరణ(Bangles Decoration) చేశారు. 4 లక్షల గాజుల($ Lakhs Bangles)తో ఆలయంలో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. గాజుల అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు(Devotees) పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో(Temple EO) చెబుతున్నారు. అంతేగాక అలంకరణ అనంతరం గాజులను అమ్మవారి భక్తులకు అందిస్తామని ఈవో తెలిపారు. ఇక ఈ యమ ద్వితీయకు ఎంతో విశిష్టత ఉంటుందని, సోదరి తన సోదరుడ్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టే పండుగగా జరుపుకుంటారని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ యమ ద్వితీయ రోజు యమ ధర్మరాజు తన సోదరికి పసుపు, కుంకుమ, గాజులిచ్చి దీవించినట్లు పురాణాలు చెబుతున్నాయని ఆలయ ప్రధాన పండితుడు వివరించారు. 

Tags:    

Similar News