Breaking News: గవర్నర్ కావాలని ఉంది.. వైసీపీ కీలక నేత కామెంట్స్ వైరల్

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో వైసీపీ ప్రముఖ నేత విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Update: 2024-04-12 10:28 GMT
Breaking News: గవర్నర్ కావాలని ఉంది.. వైసీపీ కీలక నేత కామెంట్స్ వైరల్
  • whatsapp icon

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో వైసీపీ ప్రముఖ నేత విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. తన మనసులో ఉన్న కోరిక తెలిపారు. తాను రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని అనుకోలేదని పేర్కొన్నారు.

కేవలం తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను అనుసరించి తాను రానున్న ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. అలానే తనకి గవర్నర్ కావాలనే కోరిక ఉన్నట్లు వెల్లడించారు. ఇక ఇదే విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డికి కూడ తెలియచేశానని అన్నారు.

తన రాజకీయ రిటైర్మెంట్ తరువాత తనని గవర్నర్‌ని చెయ్యమని తమ నాయకుడు జగన్‌ను కోరాను అని తెలిపారు. తన కోరికను మన్నించి జగన్ సిఫార్సు చేస్తే తాను గవర్నర్‌గా చేస్తానని పేర్కొన్నారు. 

Tags:    

Similar News