Vijayawada: వరలక్ష్మీ రూపంలో దుర్గమ్మ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు

తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మీ వ్రతం వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి...

Update: 2024-08-16 03:41 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మీ వ్రతం వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఏపీ, తెలంగాణ ఆలయాల్లో దుర్గమ్మ వారు ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. అటు  విజయవాడ దుర్గమ్మ ఆలయంలో అమ్మవారు వరలక్ష్మీ దేవిగా దర్శనమిస్తున్నారు. దీంతో ఆలయాలనికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. కృష్ణా ఘాట్‌లో స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అమ్మవారికి గాజులు, కొత్త చీరలు సమర్పిస్తున్నారు. కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు. శ్రావణ మాసంలో ప్రతి రోజూ శుభదినమని, శుక్రవారం రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం వల్ల తమ సౌభాగ్యాన్ని అమ్మవారు చల్లగా చూస్తుందని భక్తులు చెబుతున్నారు. ఈ వేడుకలతో విజయవాడ నగరంలో వరలక్ష్మీ వ్రతం శోభ నెలకొంది. 

Tags:    

Similar News