VANDE BHARAT: ఏపీ ప్రజలకు కేంద్రం తీపి కబురు.. రాష్ట్రానికి మరో వందేభారత్ మంజూరు
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో మరో వందే భారత్ రైలును నడిపేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు భువనేశ్వర్-విశాఖపట్నం-భువనేశ్వర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 12వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ రూట్‌లో వందేభారత్ ట్రయిల్ రన్‌ను శుక్రవారం నిర్వహించనున్నారు భువనేశ్వర్-విశాఖపట్నం మధ్య ఉన్న 443 కి.మీ దూరాన్ని ఈ రైలు ఆరున్నర గంటల్లో కవర్ చేయనుంది. ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజూ ఉదయం 5.15 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి విశాఖపట్నం స్టేషన్‌కు ఉదయం 11 గంటలకు చేరుతుంది. ఇక తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం నుంచి సాయంత్రం 3.45 గంటలకు బయలుదేరి భువనేశ్వర్ రాత్రి 9.30 గంటలకు చేరుకుంటుంది. భువనేశ్వర్ నుంచి విశాఖకు వచ్చే వందేభారత్.. ఖుర్దారోడ్, బరంపూర్, ఇచ్చాపురం, పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం మీదుగా విశాఖపట్నానికి చేరుతుంది. విశాఖ నుంచి బయలుదేరేటప్పుడు కూడా ఆ రూట్ల నుంచే ట్రైన్ వెళ్లనుంది