Rayachoti: టీచర్‌ను కొట్టి చంపిన కేసులో ఇద్దరి అరెస్ట్
టీచర్ మృతి కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది...
దిశ, వెబ్ డెస్క్: టీచర్ మృతి కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. రాయచోటి జిల్లా పరిషత్ స్కూలులో టీచర్‌ను విద్యార్థులు కొట్టి చంపారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేసిన పోలీసులు.. తాజాగా పురోగతి సాధించారు. నిందితులు ఇద్దరు మైనర్లు కావడంతో అదుపులోకి తీసుకుని జువైనల్ హోమ్‌కు తరలించారు. పాఠశాల 9వ తరగతి క్లాసులో పాఠం చెబుతుండగా విద్యార్థులు అల్లరి చేశారు. అయితే విద్యార్థులను ఉపాధ్యాయుడు మందలించారు. దీంతో కోపోద్రికులైన విద్యార్థులు.. తరగతి గదిలోనే టీచర్ ఛాతీపై బలంగా దాడి చేశారు. ఈ దాడిలో సృహకోల్పోయిన టీచర్.. తోటి ఉద్యోగులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఉపాధ్యాయుడు అప్పటికే మృతి చెందారు.