వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్: వైఎస్ సునీత ఇంప్లీడ్ పిటిషన్
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది.
దిశ, డైనమిక్ బ్యూరో : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన శివశంకర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈకేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని శివశంకర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. మరోవైపు వైఎస్ వివేకా కూతురు సునీత కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. వైఎస్ సునీత ఇంప్లీడ్ కావడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టుకు సీబీఐ అభిప్రాయపడింది. ఈ క్రమంలో తదుపరి విచారణను ఈ నెల 29కి హైకోర్టు వాయిదా వేసింది.