తిరులమ భక్తుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ స్వీకరణ కోసం రంగంలోకి టీటీడీ ఈవో

తిరుమల తిరుపతి కొండపై స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని ఉపయోగించారని ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Update: 2024-10-07 06:16 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి కొండపై స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని ఉపయోగించారని ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దీంతో ఈ ఇష్యూపై అధికార, ప్రతిపక్షాలు నువ్వా నేనా అన్నట్లుగా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నాయి. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేయగా.. విచారించిన కోర్టు.. ప్రభుత్వానికి పలు ప్రశ్నలు వేసి.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ను రద్దు చేసి.. కోర్టు ప్రత్యేక సిట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా తిరుమలలో లడ్డూ, అన్నప్రసాదం, ఇతర సేవల్లో భక్తులకు అందిస్తున్న సేవలపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీంతో టీటీడీ భక్తుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ స్వీకరణ ప్రారంభించింది. సీఎం ఆదేశాలతో భక్తుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ స్వీకరణ కోసం టీటీడీ ఈవో స్వయంగా రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా.. గ్యాలరీ లో భక్తుల వద్దకు వెళ్లి ఈవో.. వారిని అడిగి టీటీడీలో అందిస్తున్న వివిధ సేవల గురించి ఫీడ్‌ బ్యాక్‌ స్వీకరించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ.. ఈ ఫీడ్‌ బ్యాక్‌ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు.


Similar News