Tirupati: ఆలయంలో అర్చకుల ఘర్షణ.. సీసీటీవీ వీడియో వైరల్
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా తలకోనలోని శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయంలో అర్చకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా తలకోనలోని శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయంలో అర్చకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కార్తీకమాసం నేపథ్యంలో రద్దీ దృష్ట్యా ఇటీవల గుడి ప్రధాన అర్చకుడి కుమారుడైన మనోజ్ శర్మను ప్రచారకుడిగా నియమించారు. ఇది నిబంధనలకు విద్ధమని మరో అర్చకుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రధాన అర్చకుడు సోమవారం ఫిర్యాదు చేసిన అర్చకుడితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. అంతలో ప్రధాన అర్చకుడు ఆగ్రహంతో రెండో అర్చకుడిపై దాడి చేయడంతో వివాదం కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో అర్చకులిద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దృశ్యాలు ఆలయంలోని సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. ఇద్దరు అర్చకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం, వారిని అడ్డుకునేందుకు తోటి అర్చకులు ప్రయత్నించడం అంతా కెమెరాల్లో రికార్డైంది. ఇక ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు ఆలయంలో ఇలాంటి ఘటనలు జరగడం సరికాదని, ఆలయ పవిత్రత దెబ్బతినేలా అర్చకులు ప్రవర్తించారని మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.