Tiruchanuru: పద్మావతి అమ్మవారి సేవలో పీవీ సింధు ఫ్యామిలీ
పద్మావతి అమ్మవారిని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దర్శించుకున్నారు...
దిశ, వెబ్ డెస్క్: పద్మావతి అమ్మవారి(Padmavati Ammavaru)ని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు(Indian badminton player PV Sindhu) దర్శించుకున్నారు. గురువారం ఉదయం కుటుంబ సమేతంగా ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుంకుమార్చన సేవలోనూ పాల్గొన్నారు. పీవీ సింధుకు హైదరాబాద్(Hyderabad)కు చెందిన వెంకట దత్త సాయితో ఇటీవల వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు భర్తతో కలిసి ఆమె తిరుచానూరు వెళ్లారు. ఈ సందర్బంగా ఆలయం వద్ద పీవీ సింధు దంపతులను టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి(TTD Board Member Bhanu Prakash Reddy), ఏఈవో దేవరాజులు, ఏవిఎస్వో సతీష్ కుమార్, సూపరింటెండెంట్ రమేష్, ఇన్స్పెక్టర్లు ప్రసాద్, సుభాస్కర్ నాయుడు, చలపతి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం పీవీ సింధు కుటుంబ సభ్యులకు ఆలయాధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని పీవీ సింధు తెలిపారు.