సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తే రాజకీయాలు వదిలేస్తా.. జనసేన నేత సంచలన వ్యాఖ్యలు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తే తాను రాజకీయాలను వదిలేస్తానని తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు...
దిశ, వెబ్ డెస్క్: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తే తాను రాజకీయాలను వదిలేస్తానని తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 9న సీఎ జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారన్న వైసీపీ నేతలకు ఆయన సవాల్ విసిరారు. ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలిస్తే ముఖ్యమంత్రికి తాను ఆహ్వానం పలుకుతూ తిరుపతి నుంచి విశాఖ వరకూ పోస్టర్లు అంటిస్తానని తెలిపారు.
రాష్ట్రంలో వైసీపీ ఓడిపోబోతోందని, బెట్టింగులు కోసం ఆ పార్టీ నేతలు గెలుస్తామని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతో ట్రాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఓడిపోతున్నారనే తెలిసి.. బెట్టింగులు కాసి కోట్లు కొట్టేయొచ్చని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు చెప్పే మాటలు నమ్మి ఆ పార్టీ గెలుపుపై ఎవరూ బెట్టింగులు కట్టొదన్నారు. అన్ని సర్వేలు కూటమికే అనుకూలంగా ఉన్నామని కిరణ్ రాయల్ స్పష్టం చేశారు.