Tirupati : తిరుమల వెళ్లే భక్తులకు బ్యాడ్ న్యూస్.. సంచలన నిర్ణయం తీసుకున్న TTD

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-08-12 22:49 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ TTD నిర్ణయం తీసుకుంది . ఈ ఆంక్షలు ఆగస్ట్ 12 నుండి సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటాయని , ఈ సమయంలో ఘాట్ రోడ్లపై ఉదయం 6 నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనాలను అనుమతిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల భద్రత దృష్ట్యా టీటీడీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు

కాగా.. టీటీడీ ఫారెస్ట్ డిప్యూటీ కన్జర్వేటర్ తెలిపిన సమాచారం మేరకు ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వన్యప్రాణుల సంతానోత్పత్తి కాలం ఎక్కువగా ఉంటుంది. దీంతో క్రూర మృగాలు మొదటి ఘాట్ రోడ్డులో తరచూ రోడ్లు దాటుతూనే ఉంటాయి .వన్యప్రాణులను సంరక్షించడంతోపాటు తిరుమలకు వచ్చే యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ కన్జర్వేటర్ తెలిపారు. సెప్టెంబర్ 30 వరకు ద్విచక్రవాహనాలను మొదటి ,రెండవ ఘాట్ రోడ్‌లలో ఉదయం 6 నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని టిటిడి నిర్ణయించింది. భక్తులు ఈ మార్పును గమనించి టీటీడీకి సహకరించాలని అధికారులు కోరారు 


Similar News