Tirumala Samacharam: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?

కోరిన కోర్కెలు తీర్చే దేవదేవుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది.

Update: 2024-07-30 03:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: కోరిన కోర్కెలు తీర్చే దేవదేవుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. సోమవారం శ్రీవారి దర్శనానికి ఓ మోస్తారుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 11 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా మంగళవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఆదివారం స్వామి వారిని 65,874 మంది భక్తులు దర్శించుకోగా, అందులో 23,782 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.48 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News