ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగలు అరెస్ట్

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంతాల్లో పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను జంగారెడ్డిగూడెం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.

Update: 2024-09-15 14:16 GMT

దిశ, జంగారెడ్డిగూడెం:ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంతాల్లో పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను జంగారెడ్డిగూడెం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు.రవిచంద్ర మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో అయ్యప్ప టౌన్ షిప్ టీచర్స్ కాలనీలలో ఇంట్లో ఎవరు లేని సమయంలో తాళాలు పగలగొట్టి నలుగురు నిందితులు చోరీకి పాల్పడ్డారని ఆయన చెప్పారు. వారి నుంచి 60గ్రాములు బంగారం, 500గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నామని వివరించారు. నిందితులు గతంలో కామవరపుకోట మండలం రావికంపాడులో చోరీ చేసినట్లు అక్కడ చోరీ సొత్తు కూడ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు విలువ సుమారు నాలుగు లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన జంగారెడ్డిగూడెం సీఐ కృష్ణబాబు, ఎస్ఐ జబీర్, ఏఎస్ఐ సంపత్, రాజేంద్ర సిబ్బందిని జంగారెడ్డిగూడెం డీఎస్పీ అభినందించారు.


Similar News