పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీస్‌ ముందు మహిళా ఆత్మహత్యాయత్నం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీసు ముందు ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది.

Update: 2024-06-25 08:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీసు ముందు ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. రాజమండ్రిలో వైసీపీ మహిళా కార్పొరేటర్ తమ 1200 గజాల భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేదని వాపోయారు. అందుకే పవన్ కల్యాణ్ తమకు న్యాయం చేయాలని కోరారు. నిన్న సీఎం చంద్రబాబును కలవాలని ఆమె, ఆమె భర్త ప్రయత్నించారు. కానీ నిన్న పోలీసులు సీఎం చంద్రబాబును కలవనివ్వకుండా అడ్డుకున్నారని ఆ దంపతులు ఆరోపించారు.

ఇవాళ ఆ దంపతులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని కలిసేందుకు వచ్చామంటున్నారు. ఐతే.. పోలీసులు ఆ దంపతుల్ని క్యాంప్ ఆఫీస్‌లోకి అనుమతించలేదు. వారిని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ వైపు తరలించారు. ఇక పవన్ కళ్యాణ్‌ను కలిసే ఛాన్స్ రాదేమో అని ఆమె ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది.


Similar News