breaking:చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు నేడే..
చంద్రబాబుకి సంబంధించిన ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో విచారణ జరిపిన సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించనుంది.
దిశ వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో విచారణ జరిపిన సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించనుంది.. ఈ కేసు విషయంలో తెలుగుదేశం అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఈ రోజు సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించనుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన 17ఏ పిటిషన్ పై జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీల ధర్మాసనం నేడు తీర్పు ఇవ్వనుంది.
కాగా తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన విషయం అందరికి సుపరిచితమే. కాగా ఆయన అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా 52 రోజుల పాటు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పై సీఐడీ పలు కేసులు నమోదు చేసింది. అయితే కేసుల విషయంలో కనీస నిబంధనలు పాటించలేదని.. కనుక తన పైన పెట్టిన అన్నికేసులను క్వాష్ చెయ్యాలంటూ ప్రత్యేక లీవ్ పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు. అక్టోబర్ 20 వ తేదీన ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు తీర్పును జనవరి 16 వ తేదీకి వాయిదా వేసిన విషయం అందరికి సుపరిచితమే.