AP: పండుగ రోజు కూడా ఆగని పోరాటం..జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు

ఆంధ్రప్రదేశ్ లో ఓ వైపు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతుంటే మరో వైపు అంగన్వాడీల ఆందోళనలు తారాస్థాయికి చేరుతున్నాయి.

Update: 2024-01-16 05:19 GMT

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ఓ వైపు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతుంటే మరో వైపు అంగన్వాడీల ఆందోళనలు తారాస్థాయికి చేరుతున్నాయి. న్యాయబద్దమైన హామీల అమలు కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 35 రోజు ఉదృతంగా సాగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటుంటే.. తాము మాత్రం భర్త పిల్లల్ని వదులుకొని రోడ్డున పడాల్సిన దుస్థితికి జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నమ్మి ఓటేసి గెలిపంచినందుకు నిలువునా ముంచేశాడని.. జగన్ మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు చేసి సెట్టింగ్లు వేసి మరి సంక్రాంతి సంబరాలను అంబరాన్ని అంటేలా జరుపుకుంటున్నారని.. తమకి మాత్రం కనీసం వేతనం ఇవ్వంకుండా పండగ పూట తమని రోడ్డు పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం, అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని పండుగ రోజూ వినూత్న నిరసనలతో ప్రభుత్వాన్ని నిలదీస్తూ సమ్మెను హోరెత్తించారు. కర్నూలులో అంగన్వాడీల ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. పండగ రోజు ప్రశాంతంగా కూర్చుని కుటుంబంతో సంతోషంగా గడపాల్సిన తాము జగన్ జగన్‌ ప్రభుత్వ మొండి వైఖరితో రోడ్డు పాలయ్యామని అంగన్వాడీలు ఆందోళనకు దిగారు.

ఎమ్మిగనూరులో రహదారిపై ముగ్గులు వేసి సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలానే అనంతపురం జిల్లా లోని రాయదుర్గం లో సమ్మె చేస్తున్న అంగన్వాడీలు పొయ్యి వెలిగించి సజ్జ రొట్టెలు చేసి విన్నూత రీతోలో నిరసన తెలిపారు. పండుగ రోజు సీఎం జగన్ ఇంట్లో పండుగ కళ వెలుగు చిమ్ముతుంటే.. తమ బతుకుల్లో చీకటి కమ్ముకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నంద్యాల లోనూ ఇదే పరిస్థితి.. జగన్ ప్రభుత్వం లో మట్టి తప్ప ఏమి మిగలలేదు అని తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు మట్టి తింటూ సింబాలిక్ గా తెలిపారు. నెల్లూరులో సమ్మె చేస్తున్న అంగన్వాడీలు తమ ఆవేదనను ముగ్గుల రూపంలో చూపి నిరసన తెలిపారు. పండుగ పూట కుటుంబంతో సరదాగా గడపాల్సిందిపోయి.. ఇలా రోడ్డెక్కాల్సిన దుస్థితి జగన్ ప్రభుత్వం కారణంగా దాపరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News