తగ్గేదే లే అంటున్న అంగన్‌వాడీలు.. తారాస్థాయికి చేరుకున్న నిరసనలు

ఆంధ్రప్రదేశ్ సమ్మెలతో అట్టుడుకుతోంది. ఎటు చూసిన నిరసనలు. డిమాండ్లు పరిష్కరించాలంటూ నినాదాలు.

Update: 2024-01-09 05:18 GMT

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ సమ్మెలతో అట్టుడుకుతోంది. ఎటు చూసిన నిరసనలు. డిమాండ్లు పరిష్కరించాలంటూ నినాదాలు. అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 28వ రోజుకు చేరుకుంది. ప్రభ్భుత్వం సమ్మె చేస్తున్న అంగన్వాడీలు పైన ఎస్మా ప్రయోగించిన ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. 28 వ రోజు కూడా అంగన్వాడీలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగించారు. జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని.. కనీస వేతనం పెంపు సహా అన్ని డిమాండ్లు పరిష్కరించే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కాదని ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే.. రానున్న ఎన్నికల్లో జగన్‌కు బుద్ధి చెబుతామని అంగన్వాడీలు హెచ్చరించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపట్ల .. ప్రభుత్వం రెచ్చగొట్టే ధోరణి అవలంభిస్తోందని అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసారు.

అంగన్వాడీల పైన ప్రభుత్వ ఎస్మా చట్టాన్ని ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ NTR జి‌ల్లా నందిగామలో అంగన్వాడీలు గుంజీలు తీసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కృష్ణా జిల్లా బంటుమిల్లిలో కూడా ఇదే పరిస్థితి.. కాగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు తెలుగుదేశం నేత బూరగడ్డ వేదవ్యాస్‌ మద్దతిచ్చారు. అంగన్వాడీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వం తక్షణమే ఎస్మాను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో వీరికి కాంగ్రెస్ నేతలు మద్దతు పలికారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లోనూ భారీ ర్యాలీ నిర్వహించిన అంగన్ వాడీలు ఎస్మా జీవో పత్రాలను తగులబెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం దిగివచ్చి డిమాండ్లను పరిష్కరించేవరకు తగ్గేదే లేదంటున్నారు అంగన్ వాడీలు.

Tags:    

Similar News