అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ట.. ఆహ్వానం అందుకున్న చంద్రబాబు
నరేంద్ర మోడీ నేతృత్వం లో అయోధ్య రామమందిర నిర్మాణం శరవేగంగా పూర్తయింది.
దిశ వెబ్ డెస్క్: నరేంద్ర మోడీ నేతృత్వం లో అయోధ్య రామమందిర నిర్మాణం శరవేగంగా పూర్తయింది. ఇక గుడిలో శ్రీ రాముని ప్రాణప్రతిష్ట కూడా పూర్తయితే హిందువులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న చిరకాల వాంఛ తీరిపోతుంది. కాగా ప్రజల ఆశ తీరేలా ఈ నెల 22వ తేదీన రాముని ప్రాణ ప్రతిష్ట చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు ఆహ్వానం పంపారు.
కాగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా దేశం లోని వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులకు, ప్రతిపక్ష నేతలకు, సీనియర్ నేతలకు, అలానే వివిధ రంగాల ప్రముఖులకు శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు ఆహ్వానం పంపుతున్నారు. ఇక ఇప్పటికే జనవరి 22 వ తేదీ జరగనున్న రాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు పారరంభమైయ్యాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల నుండి కూడా అయోధ్య రామునికి వివిధ రూపాలలో సేవలు అందుతున్నాయి. ఇక ఈ నెల 21వ తేదీ వరకు ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు నిర్వాహణ జరగనుంది. కాగా ఈ నెల 18వ తేదీన ఆలయ గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహాన్ని ఉంచుతారు. ఇక 22వ తేదీ మధ్నాహ్నం 12:20 గంటలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మొదలుకానుంది.