తిరుమలలో బాలుడి కిడ్నాప్.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు
తిరుమలలో ఆదివారం సాయంత్రం మూడేళ్ల బాలుడు అభినయ్ కిడ్నాప్‌కు గురయ్యాడు...
దివ, వెబ్ డెస్క్: తిరుమలలో ఆదివారం సాయంత్రం మూడేళ్ల బాలుడు అభినయ్ కిడ్నాప్‌కు గురయ్యాడు. శ్రీవారిని దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లాకు చెందిన దంపతులు తమ మూడేళ్ల కుమారుడితో కలిసి తిరుమలకు వెళ్లారు. యాత్రికుల వసతి సముదాయం-2 వద్ద వేచియున్నారు. అయితే తల్లిదండ్రుల కళ్లు కప్పి బాలుడిని ఓ మహిళ తీసుకెళ్లారు. ఎవరికీ అనుమానం రాకుండా వెంటనే తిరుమల నుంచి తిరుపతికి చేరుకుంది. తమ బాలుడు కనబడకపోవడంతో తల్లిదండ్రులకు తిరుమల పోలీసులకు సమాచారం అందజేశారు. స్థానిక సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా తిరుపతి రైల్వే స్టేషన్‌కు బాలుడిని మహిళ తీసుకెళ్లినట్లు గుర్తించారు. వెంటనే తిరుపతి పెద్దకాపు లే ఔట్ పోలీసులకు సమాచారం అందజేశారు. రంగంలోకి దిగిన పోలీసులు తిరుపతి సిటీ అంతా గాలించి బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళను పట్టుకున్నారు. తమకు పిల్లలు లేకపోవడంతోనే బాలుడిని తీసుకెళ్లినట్లు మహిళా కిడ్నాపర్ ఒప్పుకున్నారు. కేసును ఛేదించిన పోలీసులు.. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం అయింది.