AP News:టీటీడీ చైర్మన్ రేసులో ఆ పార్టీ నేతలు..?

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పోస్ట్ అంటే రాజకీయ నాయకులకు ఎంతో ప్రీతి.

Update: 2024-07-10 14:03 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ప్రజా సంక్షేమం పై ప్రత్యేక దృష్టి పెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పోస్ట్ అంటే రాజకీయ నాయకులకు ఎంతో ప్రీతి. నెల రోజులుగా ఆ పోస్ట్ ఖాళీగానే ఉంది. అయితే ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్ ఎవరు అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. కూటమి అధికారంలోకి రాగానే పలువురు కూటమి నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో పవన్ కళ్యాణ్ సోదరుడు, జనసేన నేత కొణిదేల నాగబాబు పేరు కూడా మొదట వార్తల్లో నిలిచింది. అలాగే వేమిరెడ్డి ప్రశాంతి, రఘురామకృష్ణంరాజు, అశ్వనీదత్ పేర్లు వినిపించాయి. కానీ దీనిపై చంద్రబాబు సర్కార్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే కూటమి ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్ ఎవరు అన్నదానిపై అనేక సందేహాలు నెలకొన్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత టీటీడీ చైర్మన్ బరిలో అశ్వనీదత్‌తో పాటు ఒక న్యూస్ ఛానల్ యజమాని పేరు వినిపించింది. తాజగా అశోక్ గజపతి రాజు, సినీ నటుడు మురళి మోహన్‌లు కూడా ఈ రేసులో ఉన్నట్లు సమాచారం. త్వరలో ఈ అంశంపై పూర్తి క్లారిటీ రానున్నట్లు సమాచారం.


Similar News