ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి కీలక ప్రకటన

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం హామీల అమలులో దూకుడు పెంచింది. ...

Update: 2024-07-10 11:13 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం హామీల అమలులో దూకుడు పెంచింది. ఎన్నికల ప్రచారంలో ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి మహిళకు ప్రతి నెల రూ. 1500, ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి రైతుకు ఏటా రూ. 20 వేలు, ప్రతి స్కూలుకు వెళ్లే విద్యార్థికి రూ. 15 వేలు, యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు వంటి సూపర్ సిక్స్ హామీలు హామీలు ఇచ్చింది. అధికారంలోకి రెండు నెలలు కావడంతో పాలనపై పూర్తిగా దృష్టిసారించింది. ఎన్నికల హామీలపై కసరత్తులు ప్రారంభించింది. త్వరలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.

ఈ సందర్బంగా సూపర్ సిక్స్ పథకాలపై మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక ప్రకటన చేశారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. అలాగే మండల స్థాయిలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. పేదల సంక్షేమమే తమ లక్ష్యమని చెప్పారు. రైతుల పాస్‌బుక్‌లపై జగన్ ఫొటోను తీసి వేసి ప్రభుత్వ ముద్ర వేస్తామన్నారు. ఇప్పటికే ల్యాండ్‌టైటిల్‌ను రద్దు చేశామని గుర్తు చేశారు. బాపట్ల జిల్లాలను నెంబర్‌వన్‌గా మారుస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. 


Similar News