PAC చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ.. బరిలో దిగిన కూటమి ఎమ్మెల్యేలు

రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(Public Accounts Committee)) ఎన్నికల పై చర్చలు జరుగుతున్నాయి.

Update: 2024-11-21 13:53 GMT

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(Public Accounts Committee)) ఎన్నిక పై చర్చలు జరుగుతున్నాయి. ఈక్రమంలో పీఏసీ చైర్మన్‌గా(PAC Chairman) ఎవరు? అంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడనున్నట్లు సమాచారం. జనసేన ఎమ్మెల్యే(Janasena MLA) పులపర్తి రామాంజనేయులు(Pulaparthi Ramanjaneyulu) పీఏసీ చైర్మన్‌గా ఎన్నికవడం లాంఛనమేనని తెలుస్తోంది. అయితే పీఏసీ చైర్మన్ పదవికి టీడీపీ తరఫున శ్రీరాం రాజగోపాల్ (జగ్గయ్యపేట ఎమ్మెల్యే), బీవీ జయనాగేశ్వరరెడ్డి (ఎమ్మిగనూరు ఎమ్మెల్యే), ఆరిమిల్లి రాధాకృష్ణ (తణుకు ఎమ్మెల్యే), అశోక్ రెడ్డి (గిద్దలూరు ఎమ్మెల్యే), బూర్ల రామాంజనేయులు (ప్రత్తిపాడు ఎమ్మెల్యే), నక్కా ఆనంద్ బాబు (వేమూరు ఎమ్మెల్యే), కోళ్ల లలితకుమారి (ఎస్.కోట) నామినేషన్ దాఖలు చేయగా.. Janasena నుంచి పులపర్తి రామాంజనేయులు ఒక్కరే బరిలో దిగారు. BJP నుంచి విష్ణుకుమార్ రాజు నామినేషన్ వేయగా.. వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(పుంగనూరు ఎమ్మెల్యే) నామినేషన్ వేశారు. వైసీపీకి అసెంబ్లీలో బలం లేకపోవడంతో.. పీఏసీ చైర్మన్ పదవి కూటమి అభ్యర్థినే వరించనున్నట్లు సమాచారం. దీనిపై అసెంబ్లీ స్పీకర్ అధికారిక ప్రకటన చేయనున్నారు.

Tags:    

Similar News