‘రాష్ట్రం అభివృద్ధి పథంలో తప్పక నడుస్తోంది’..ఆ పార్టీ సీనియర్ నాయకురాలు కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అభివృద్ధి బాటలో నడుస్తుందని టీడీపీ సీనియర్ నాయకురాలు, జాతీయ చేనేత నాయకురాలు, చిత్రకారిణి సంకారపు జయశ్రీ తెలిపారు.

Update: 2024-08-29 12:15 GMT

దిశ ప్రతినిధి, ధర్మవరం:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అభివృద్ధి బాటలో నడుస్తుందని టీడీపీ సీనియర్ నాయకురాలు, జాతీయ చేనేత నాయకురాలు, చిత్రకారిణి సంకారపు జయశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా వారి స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రలేఖనము గీసి, ఆ చిత్రలేఖ పటాన్ని విజయవాడ ముఖ్యమంత్రి కార్యాలయంలో గల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేయడం జరిగిందని తెలిపారు. గత 28 సంవత్సరాల నుంచి నారా చంద్రబాబు నాయుడు దగ్గర నేను పార్టీ పరంగా రాత్రి పగలు సేవలు అందించడం జరిగిందని తెలిపారు. అన్ని పార్టీ కార్యక్రమాలలోనూ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం జరిగిందని తెలిపారు. పార్టీ అభిమానిగా తాను ఎంతో కృషి చేశానని, భగవంతుడు నాకు ఇచ్చిన చిత్రలేఖనం ను ఉపయోగించుకొని ముఖ్యమంత్రి బొమ్మను వేయడం నాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు.

పది సంవత్సరాలు హైదరాబాద్ టీడీపీ ఆఫీస్‌లో సేవలు అందించడం జరిగిందనీ, విజన్ 2020 లో ఏపీ అభివృద్ధి చెందిందని, అదేవిధంగా 2047 విజన్‌లో కూడా ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని వారు తెలిపారు. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు రాయలసీమ, ఏటీపీ జయశ్రీ గా నన్ను గుర్తించడం జరిగిందని తెలిపారు. జన్మభూమి, శ్రమదానం లాంటి కార్యక్రమంలో తాను చురుకుగా పాల్గొని, ఎంతో మందికి స్ఫూర్తి ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు నాకు సహాయ సహకారాలు అందించడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్‌ను కూడా కలవడం జరిగిందని తెలిపారు. ధర్మవరం నియోజకవర్గం యొక్క సమస్యలను కూడా ఇరువురికి విన్నవించడం జరిగిందని, అభివృద్ధి కోసం పాటుపడే విధంగా తమ సహాయ సహకారాలను కోరడం జరిగిందన్నారు.

నేడు టెక్నాలజీ యూత్‌కు ఆదర్శంగా నిలిచిందన్నారు. అప్పట్లో హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ కంపెనీలు పరిశ్రమలు విస్తారంగా రావడం జరిగిందని తెలిపారు. తదుపరి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి కనుమరుగు కావడం బాధాకరమని తెలిపారు. ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో ఆంధ్ర ప్రదేశ్‌ను ముందుకు తీసుకుని వచ్చే సత్తా కేవలం నారా చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఉందని తెలిపారు. ఈ ఐదు సంవత్సరాలు తాను ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి సేవలు తప్పక చేస్తానని, ధర్మవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు తన వంతుగా కృషి చేస్తూ, ఎల్లప్పుడూ అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ముఖ్యంగా తాను చేనేత పరిశ్రమను పరీక్షించుకొనుటకు, చేనేత కార్మికుల యొక్క బ్రతుకులను కాపాడుకునేందుకు తనవంతుగా ప్రభుత్వంతో ఎమ్మెల్యే ,మంత్రుల ద్వారా సమస్యలు ప్రభుత్వానికి తెలిపి పరిష్కరించే విధంగా తాను నిరంతరం శ్రమిస్తానని తెలిపారు.


Similar News