21 సీట్లకు కుదించడం బాధ కలిగించింది.. జనసేన నేత ఆవేదన

పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు ఖరారు అయ్యాయి. దాంతో పాటు రెండు పార్లమెంట్‌ సెగ్మెంట్లలో పోటీ చేయనుంది.

Update: 2024-03-12 10:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు ఖరారు అయ్యాయి. దాంతో పాటు రెండు పార్లమెంట్‌ సెగ్మెంట్లలో పోటీ చేయనుంది. బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలతో పాటు ఆరు పార్లమెంట్ స్థానాల్లో బరిలోకి దిగనుంది. ఇక టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దింపనుంది. దీనిపై సోమవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పవన్ కల్యాణ్, చంద్రబాబు, గజేంద్ర షెకావత్ కలిసి సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సీట్లపై అధికారిక ప్రకటన చేశారు.

తాజాగా.. జనసేనకు సీట్లు తగ్గడంపై జనసేన నేత కిరణ్ రాయల్ స్పందించారు. మంగళవారం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ.. 21 సీట్లకు జనసేనను కుదించడం బాధాగా అనిపించింది కానీ, జగన్‌ను ఓడించడం కోసం తప్పడం లేదని అన్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు పవన్ కల్యాణ్ చుట్టే తిరుగుతున్నాయని తెలిపారు. బీజేపీ, టీడీపీ మధ్య పవన్ కల్యాణ్ ఉన్నారని అన్నారు. జగన్‌ను ఓడిస్తే రాష్ట్ర ప్రజలతో పాటు తమకు కూడా మనశ్శాంతిగా ఉంటుందని వెల్లడించారు.

Tags:    

Similar News