AP:డిప్యూటీ సీఎం పవన్ తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన జనసేన ఇన్చార్జ్
కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తరఫున పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ శుక్రవారం పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి
దిశ,పిఠాపురం: కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తరఫున పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ శుక్రవారం పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి, పురుహూతిక శక్తిపీఠం ఆలయాల్లో స్వామి వారికి, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముందుకు సాగాలని, రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున కుక్కుటేశ్వర స్వామి, అమ్మవార్ల దీవెనలను కోరుకున్నట్లు పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. స్వామి, అమ్మవార్లను తలచుకున్నా, పూజ చేసినా విజయానికి ఢోకా ఉండదనేది భక్తుల విశ్వాసమని, ఈ ఆలయానికి భక్తిప్రపత్తులతో వచ్చే ప్రతి జీవితం సార్థకం అవుతుందన్నారు.