‘కుర్చీ మడత పెట్టి’ సాంగ్.. స్టెప్పులతో అదరగొట్టిన ఐఏఎస్ అధికారి(వీడియో వైరల్)
అల్లూరి జిల్లా(Alluri District)లో పర్యాటక ప్రాంతమైన అరకు(Araku)లో చలి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: అల్లూరి జిల్లా(Alluri District)లో పర్యాటక ప్రాంతమైన అరకు(Araku)లో చలి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అరకులోయలో ‘చలి ఉత్సవ్-25’ నిన్న(శుక్రవారం) ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ అరకు చలి ఉత్సావాలను జిల్లా కలెక్టర్(District Collector) ఎ.ఎస్. దినేశ్ కుమార్(Dinesh Kumar) లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల(Govt Degree College) మైదానంలో చలి ఉత్సవాలు జరుగుతున్నాయి. గిరిజన ప్రాంతాల ఆహార, వాణిజ్య పంటల ఉత్పత్తులతో స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాల్లో 7 రాష్ట్రాల కళాకారులు పాల్గొన్నారు.
పనుల్లో ఎల్లప్పుడు బిజీబిజీగా ఉండే IASలు ఈ ఉత్సవాల్లో సరదాగా గడిపారు. IASలు ఆటపాటలతో గంతులేస్తున్నారు. గిరిజనులతో సంప్రదాయ నృత్యాలే కాదు.. ఏకంగా సినీ పాటలతో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఐఏఎస్ అధికారి ‘నీలి నీలి ఆకాశం’ పాట పాడారు. కళాకారులతో కలిసి కలెక్టర్ దినేష్ కుమార్, ఐటిడిఎ పిఓ అభిషేక్, సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సాంప్రదాయ నృత్యాల్లో పాల్గొన్నారు. పి ఓ అభిషేక్, సబ్ కలెక్టర్ సౌర్య మాన్ పటేల్ డోలు వాయించి ఉత్సాహం పెంచారు. ఇక ఐటీడీఏ పీవో అభిషేక్ అయితే.. మరో అడుగు ముందుకేశారు.
సూపర్ స్టార్(Superstar) మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా నటించిన గుంటూరు కారం(Guntur Karam) మూవీలోని ‘కుర్చీ మడతపెట్టి సాంగ్’ వినిపించగానే ఫుల్ జోష్‌తో ఊగిపోయారు. ఇంకేముంది ఇక ఆ పాటకు స్టెప్పులేస్తూ డాన్స్ ఇరగదీశారు. ఆ కుర్చీని మడత పెట్టి అంటూ.. ఆ యువ IAS స్టెప్పులకు అందరూ ఫిదా అయ్యారు. అయితే మూడు రోజులపాటు నిర్వహించే అరకు ఉత్సవ్‌ను స్థానికులు, పర్యాటకులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. రేపు(ఆదివారం) కూడా అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తారని అధికారులు భావిస్తున్నారు.