ఏపీలో 37 మంది ఐపీఎస్‌ల బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కూటమి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం గత ప్రభుత్వంలో జరిగిన సమస్యలు ఉత్పన్నం కాకుండా పాలనపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

Update: 2024-07-13 13:17 GMT

దిశ, వెబ్ డెస్క్: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కూటమి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం గత ప్రభుత్వంలో జరిగిన సమస్యలు ఉత్పన్నం కాకుండా పాలనపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన రాగానే అధికారుల మార్పులు చేసింది. ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 37 మంది ఐపీఎస్ అధికారులను మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా ఉత్తర్వుల ప్రకారం.. తూర్పు గోదావరి ఎస్పీగా నరసింహ కిషోర్, కృష్ణ జిల్లా ఎస్పీగా గంగాధర్ రావు, శ్రీకాకుళం ఎస్పీగా కేవీ మహేశ్వర్ రెడ్డి, అనకాపల్లి ఎస్పీగా ఎం. దీపిక, విజయనగరం ఎస్పీగా వకుల్ జిందాల్, సత్యసాయి జిల్లా ఎస్పీగా వి. రత్న, పార్వతీపురం మన్యం ఎస్సీగా మాధవరెడ్డి, కాకినాడ ఎస్సీగా విక్రాంత్ పాటిల్, గుంటూరు ఎస్పీగా సతీష్ కుమార్, బాపట్ల ఎస్పీగా తుషార్ దూడి, అల్లూరి జిల్లా ఎస్పీగా అమిత్ బర్దార్, విశాఖ డిప్యూటీ కమిషనర్-2గా తుహిన్ సిన్హా, అంబేద్కర్ కోనసీమ ఎస్పీగా బి. కృష్ణరావు, అన్యమయ్య జిల్లా ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా నయీం అస్మీ, ఏలూరు ఎస్పీగా ప్రతాప్ శివ కిషోర్, పల్నాడు ఎస్పీగా కే. శ్రీనివాసరావు, విజయనగరం 5 వ బెటాలియన్ కమాండెంట్ గా మల్లికా గార్గ్, ప్రకాశం ఎస్సీగా ఏఆర్ దామోదర్, కర్నూల్ ఎస్పీగా బిందు మాధవ్, నెల్లూరు ఎస్పీగా కృష్ణకాంత్, నంద్యాల ఎస్సీగా అధిరాజ్ సింగ్ రాణా బాధ్యతలు తీసుకొనున్నారు. అలాగే రాధిక, ప్రశాంతి, ఆరిఫ్ డీజీపీ ఆఫీస్ కి అటాచ్, సిద్ధార్థ్ కౌశల్, సునీల్, జగదీష్, రఘువీరా రెడ్డి, శ్రీధర్, సత్తిబాబు లను డీజీపీ ఆఫీస్ కి అటాచ్ చేశారు.

Tags:    

Similar News