ఏపీలో గెలిచేదెవరు..?.. ఓడేదెవరు..?.. కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్

ఏపీ ఎన్నికల ఫలితాలపై మరికాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి..

Update: 2024-06-01 12:17 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న ఎన్నికలు జరిగాయి. 175 నియోజకవర్గాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్‌లో ప్రజలు భారీగా తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో పోలింగ్ శాతం నమోదు అయింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 82 శాతం పోలింగ్ నమోదు అయింది. ప్రస్తుతం ఈవీఎంల్లో అభ్యర్థుల భవిష్యత్తు నిక్షిప్తమై ఉంది. మరో మూడు రోజుల్లో ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. దీంతో ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ, టెన్షన్ ప్రతి ఒక్కరిలో నెలకొంది.

మరోవైపు పలు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. దేశంలోని అన్ని పార్లమెంట్ స్థానాలకు విడుతల వారీగా పోలింగ్ జరిగింది. ఈ రోజు ఏడో విడత ఎన్నికల పోలింగ్ జరిగింది. మరికాసేపట్లో పోలింగ్ సమయం ముగియనుంది. దీంతో దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిసినట్టవుతుంది. ఈ మేరకు దేశంలో ఏ పార్టీ గెలవబోతోంది. మరోసారి ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందా..?., లేదా కాంగ్రెస్ మిత్రపక్షాలు అధికార పీఠాన్ని దక్కించుకోబోతున్నాయా అనేది మరికాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ విడుదలతో తేలిపోనుంది. అటు ఏపీలో గెలిచేదెవరు..?. ఓడేదెవరు..? అన్న ఉత్కంతకు సైతం తెరపడనుంది. మరికాసేపట్లో విడుదల కాబోయే ఎగ్జిట్ పోల్స్ ఏపీ ఫలితం ఎవరిదో చెప్పనున్నాయి. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత చేసిన సర్వేలను ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా బయటకు రాబోతున్నాయి. 


Similar News